Rohit Sharma: సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ వైదొలుగుతాడా? 7 d ago
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ తో తంటాలు పడుతున్నాడు. ఈ సిరీస్ లో ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా అతడి బ్యాట్ నుంచి రాలేదు. తాజాగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే మెల్‌బోర్న్ మైదానంలోనూ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ తేలిపోయాడు. ఆఫ్ సైడ్ పడిన బంతిని, లెగ్ సైడ్ షాట్ కొట్టేందుకు యత్నించి వికెట్ సమర్పించాడు. కేవలం 3 పరుగులకే పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. దీంతో అతడిని తీసేయాలనే డిమాండ్లూ మొదలయ్యాయి. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ఆసీస్ తో ఐదో టెస్టు జరగనుంది. ఇప్పుడు బ్యాటింగ్ లో ఇబ్బందిపడుతున్న రోహిత్, అతడి సారథ్య వ్యూహాలపై మాజీలు అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.
"ఇప్పుడు రోహిత్ కి అత్యంత క్లిష్ట సమయం నడుస్తోంది. బాక్సింగ్ డే టెస్టులో ఇంకా రెండో ఇన్నింగ్స్ ఉంది. అలాగే సిడ్నీ మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. ఒకవేళ అక్కడా విఫలమైతే రోహిత్‌పై ప్రశ్నల పరంపర మరింత పెరగడం ఖాయం" అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు